GeneralHealthLatestNews

నాణ్యత లేని మూడు వందల పడకల ఆసుపత్రి నిర్మాణం.

నాణ్యత లేని మూడు వందల పడకల ఆసుపత్రి నిర్మాణం.
ప్రజాధనం వృధా అవుతోందని వాపోతున్న ప్రజలు.

నాణ్యత లేని మూడు వందల పడకల ఆసుపత్రి నిర్మాణం.

గద్వాల పట్టణ కేంద్రం లో దౌదర్ పల్లి దగ్గర గత రాష్ట్ర ప్రభుత్వం గద్వాల జిల్లా ప్రాంతం నకు 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అనుమతిని ఇచ్చింది.

ఈ ఆసుపత్రి నిర్మాణం పనులను ఆర్. కే. ఐ బిల్డర్స్ ప్రవేట్ లిమిటెడ్ వారి యాజమాన్యం అయిన రాజేంద్రప్రసాద్ చెన్నై వారు చేపట్టారు.ఈ హాస్పిటల్ నిర్మాణం పనులు ముగింపు లో వున్నాయి.

హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ప్లోర్ లలో కొన్ని గదుల లోపల గోడల భాగం క్రాక్ (నేర్రలు. పగుళ్ళు ) వచ్చాయి .

నిర్మాణ పనుల పర్యవేక్షణ పి.ఎస్.ఎం.ఐ.డి.సి ఆధ్వర్యంలో నిఘా లో ఉంది . ఈ విషయం ను ఇంజనీర్ సాయి. అకౌంటెడ్ రాఘవరెడ్డి ని మీడియా ప్రశ్నించింది.

అందుకు వారు సమాధానం చెబుతూ ముఖ్యమైన అధికారులు లేరని ,ఈ హాస్పిటల్ గదులలో పగుళ్ళు లేవని అన్నారు.

తమ ముఖ్య అధికారులు వచ్చిన తరువాత మాట్లాడమని, తమకు ఏమి తెలువదు అని సమాధానం ఇచ్చారు . ఎంతోమంది రోగులు చికిత్స పొందే హాస్పిటల్ నాణ్యత లేకపోతే ప్రజల ధనం ను వృధా చేసినట్లే అని ప్రజలు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *